Verse 1
దైవజనులు కావాలి - కావాలి
దైవజనులు లేవాలి - లేవాలి
ప్రభుసేవకు - పరుగులెత్తువారు
ప్రభుకోసం - ప్రాణమిచ్చెడివారు - 2
Verse 2
నశించి పోవు లోకముకొరకు - కన్నీరు కార్చెడివారు - 2
పడిపోయిన ప్రాకారములు - కట్టగోరు నెహెమ్యాలు
తన ప్రజల పాపాలకై - విలపించు సమూయేలులు - 2 ||దైవ ||
Verse 3
ప్రభుపిలుపును వినిన వెంటనే - వలలు విడచి వెంబడించిన - 2
పేతురు వంటి శిష్యులు - కావాలి... లేవాలి
ఎలీషా వంటివారు - కావాలి... లేవాలి - 2 ||దైవ ||
Verse 4
విశ్వాసుల సంపూర్ణతకై - ప్రార్ధనలో పోరు సల్పెడి - 2
ఎపఫ్రావంటి యోధులు - కావాలి... లేవాలి
ఆత్మల భారం కలవారు - కావాలి.... లేవాలి - 2 ||దైవ ||
Verse 5
కోతెంతో విస్తారము - కోసెడి పనివారు కొదువగా - 2
పొలములో పని చేయుటకు - వస్తావా - నీవు వస్తావా
నీ పనికి జీతమున్నది - బహుమానమున్నది కిరీటమున్నది - 2 ||దైవ ||