యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో - నీతిమంతులయ్యెదరు
ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు
ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు ||యేసుని ||
లెబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు
ప్రభు కృప జ్ఞానములో - ఎదుగుచు నుందురు వారు ||యేసుని ||
యెహోవా మందిరములో - నాటబడియుండెదరు
సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులైయుండెదరు ||యేసుని ||
దేవుని యావరణములో - వర్ధిల్లుచూ నుండెదరు
సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరంతరము ||యేసుని ||
ముసలితనంబున వారు - చిగురుపెట్టి ఫలింతురు
ప్రసిద్ధి చేతురు ప్రభుని - యధార్ధవంతుడనుచు ||యేసుని ||
నీటికాలువ యోరను - నాటబడిన వారలై
మేటి సారము కలిగి - పచ్చగ నుందురు వారు ||యేసుని ||
హల్లెలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు
చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచి యుండెదరు ||యేసుని ||