Verse 1
స్తుతి నే పాడెద యేసయ్యా (2)
దుర్గమా - శైలమా - శృంగమా -నా సర్వమా (2)
Verse 2
నా రాగానికి జీవము నీవే - నా గానానికి ప్రాణము నీవే
నా ధ్యానానికి రూపము నీవే
యేసయ్యా యేసయ్యా (2) ||స్తుతి ||
Verse 3
నా గమనానికి ద్వారము నీవే - నా పయనానికి తీరము నీవేె
నా మార్గానికి దీపము నీవే
యేసయ్యా యేసయ్యా (2) ||స్తుతి ||
Verse 4
నా కీర్తనకు కర్తవు నీవె - నా ప్రార్ధనకు అర్ధము నీవే
నా స్తోత్రమునకు పాత్రుడ నీవే
యేసయ్యా - యేసయ్యా (2) ||స్తుతి ||