Verse 1
యేసురాజు ఏతెంచు - వేళ ఆసన్నం
అనుకొనని ఘడియలో - ధ్వనించు బూరశబ్ధం
విందువా మేల్కొందువా - సంసిద్ధమా సంధింతువా || యేసురాజు ||
Verse 2
అర్ధరాత్రివేళ వినిపించె కేక - పెండ్లి కుమారుని ఎదుర్కొన రండని
నడుము కట్టుకొనుము - నూనె నింపుకొనుము
నిత్య ప్రకాశముతో - నీ సిద్ధి వెలుగ నిమ్ము
బుద్ధిగల కన్యకవై - విందులో పాల్గొనుము ||విందువా ||
Verse 3
సూచనలన్నీ నెరవేరుచున్నవి - ఈ కాలము నీవు గుర్తించవేల
ఉరివలె ఆదినము - తరలి రాకుండుటకు
మెలుకువతో ప్రార్థించు - ఓ సోదరా
మగత వీడి సిద్ధపడుము - ఓ క్రైస్తవ ||విందువా ||