Verse 1
దున్నని బీడుదున్ని విత్తనాలు చల్లుతున్నా
ఎండనక వాననక సేద్యాన్నీ చేస్తున్నా ||2||
వర్షాన్ని పంపించు ఓ యేసయ్యా
విత్తనాలు మొలిపించు నా యేసయ్యా
Verse 2
చిన్నమందను చూడయ్యా - చిగురిస్తూ ఉన్నది
ప్రాకారములేకయే భయపడుచూ ఉన్నది
పూతచేను పాడుచేయు గుంటనక్కలున్నవి
కంచెవేసి కాపుకాయి కన్న తండ్రీ
పండించు ఈ పొలమును పరమతండ్రీ ||2|| ||స్తోత్రము ||
Verse 3
యేపుగ పెరిగేచేను వెన్నులేస్తున్నది
సాతాను పందికొక్కు పొంచిచూస్తున్నది
పంటకు వచ్చేదాక పైరును కాపాడు
పండాలి ఆత్మ లెన్నో దండిగాను
ముప్పది అరువది నూరురెట్లుగాను
స్తోత్రము స్తోత్రము నీనామమే పవిత్రము ||2|| ||దున్నని ||
Verse 4
స్తోత్రము స్తోత్రము నీ నామమే పవిత్రము ||2||