Verse 1
పావురమా ! పావురమా !
ప్రపంచ శాంతికి సంకేతమా ! - 2
Verse 2
బండసందుల సవ్వడిలోను - కొండలోయల ముళ్లలోను
కమ్మనిది నీ శాంతి గీతం - కపోతమా ! సంధించు సరిగమ !! ||పావుర ||
Verse 3
క్రీస్తు ప్రభుని ప్రాణేశ్వరివి - స్త్రీలందరిలో అతి సుందరివి
స్వరమునెత్తి స్తుతులు పాడుమా - కపోతమా! యేసుని ప్రియతమా!! ||పావుర ||
Verse 4
అతి మధురం నీ గళ సంగీతం - మనోహరము నీ ముఖారవిందం
మయూరివై నాట్యము సేయుమా - కపోతమా! నిర్మల కమలమా!! ||పావుర ||
Verse 5
యేసే నీకతి ప్రియుడు కాగా - నీవే ఆయన వధువు కాగా
నీవిక భయమును వీడుమ సంఘమా - కపోతమా! షారోను కుసుమమా!! ||పావు ||