Verse 1
మార్పు లేని దేవా - మా యందు ఉన్నదేవా
స్తుతించి పాడి - కొనియాడి ఆరాధింతుము
హల్లెలూయా - ఆనందమే - నీయందు మాకు విజయమే
Verse 2
యోగ్యత లేనివారము మేము - నీ కృపకు అపాత్రులం
అయినను కృప చూపుదునంటివి - మా పక్షమున ఉందునంటివి
హల్లెలూయా యేసయ్యా - మా పక్షమందు ఉన్నావయ్యా ||మార్పు లేని ||
Verse 3
నీ ఆత్మ శక్తితో దర్శించుచున్నావు - బీడైన మా బ్రతుకులన్
నిండుగ మెండుగ ఫలింప - చేయగల వాడవు నీవయ్యా
హల్లెలూయా యేసయ్యా - ఆత్మఫలము పండింతువు
హల్లెలూయా యేసయ్యా - దీవించి వర్ధిల్ల చేతువు ||మార్పు లేని ||
Verse 4
జీవితయాత్ర ఎంతో ప్రయాసం - మార్గము శోధనమయం
నా పాదములు తొట్రిల్ల నీయక - నడిపించు చున్నావయ్యా
హల్లెలూయా యేసయ్యా - మా దాగుచోటు నీవయ్యా
హల్లెలూయా యేసయ్యా - నీవు మాతోడై ఉన్నావయ్యా ||మార్పు లేని ||