Verse 1
సమస్యలను రేణువుగా చూడుము - సహాయకుని మేరువుగా వేడుము
Verse 2
క్రీస్తు నందె నీతి బలములున్నవి - రక్షణ నిరీక్షణ నిలిచియున్నవి - 2
సత్యజీవమార్గములు ఆయనే - నమ్మితే ఎన్నటికీ సిగ్గునొందవు ||హల్లె ||
Verse 3
కష్టనష్టములవైపు చూడకు - నిష్టూరములు నిత్యమని తలపోయకు - 2
కష్టములు చుట్టముల్ సోదరా - పక్షులవలె ఎగిరిపోవు స్తుతి పాడరా ||హల్లె ||
Verse 4
శ్రమలలో కావాలి ధైర్యము దైవవాక్కులే మనకు సమాధానము - 2
ప్రభువునందు తిరుగులేని విశ్వాసము లోకమును జయించే సాధనము ||హల్లె ||
Verse 5
వ్యర్ధమైన యోచనలు మానుము దిద్దుబాటు మనస్సు నీకు అవసరము
బుద్ధిజ్ఞాన సంపదలు ఆయనే - సిద్ధమనస్సు కల్గి ముందు సాగుము ||హల్లె ||
Verse 6
యేసునందు విశ్వాసముంచుము
విశ్వాస యాత్రలో సాగిపోవుము
హల్లెలూయా హల్లెలూయా - 2