దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||