Verse 1
బ్రతుకులోని వెలుగు నీవే భావిజీవిత బాట నీవే
భారమైన జీవితమును - చేరబిలిచిన నాధ నీవే
Verse 2
సర్వలోకము సృష్ఠించినట్టి - సృష్ఠికర్తవు నీవె నీవే
సర్వప్రాణుల సృజించినట్టి - సదయుడవు నీవె నీవే ||బ్రతుకులోని ||
Verse 3
సర్వపాలన మొనర్చునట్టి - రాజరాజవు నీవె నీవే
మరణమున్ జయించి లేచిన - మృత్యుంజయుడవు నీవె నీవే ||బ్రతుకులోని ||
Verse 4
నాదు ప్రాణ ప్రియుడ నీవె - నాదు రక్షణ కర్తవు నీవే
నాదు కోట కొండయు నీవె - నా ఆశ్రయ దుర్గము నీవే ||బ్రతుకులోని ||
Verse 5
నాదు జీవన దాతవు నీవె - నాదు జీవ మార్గము నీవే
నాలోని పిలుపు నీవె - పిలుపులోని స్వరము నీవే ||బ్రతుకులోని ||