Verse 1
ఇంతగ నన్ను ప్రేమించినది - నీ రూపము నాలో రూపించుటకా
ఇదియే... నాయెడ నీకున్న నిత్య సంకల్పమా - 2
Verse 2
శ్రమలలో సిలువలో నీరూపు నలిగినదా - 2
శిలనైనా నన్ను నీవలెె మార్చుటకా
శిల్ప కారుడా - నా యేసయ్య
మలచుచుంటివా నీ పోలికగా ||ఇది ||
Verse 3
తీగలు సడలి అప స్వరములమయమై
మూగబోయెనే - నా స్వరమండలము
అమరజీవి స్వరకల్పనలు - నా అణువణువున పలికించితివా ||ఇది ||