Verse 1
మరణపు నీడలో నిలిచిన మానవ - శరణమని శ్రీ యేసుని చేరవ
కరుణామృతము యేసుని ప్రేమా - కరములు చాచి పిలచెను రావా
Verse 2
ఆవిరి వంటిది నీ జీవితము - అంతలో కనబడి మాయమగును
శాశ్వతమైనది ఏదియులేదు - నేడే యేసుని చేరుమురా ||మరణపు ||
Verse 3
లోకమునంతా సంపాదించిన - లాభమేమి కలుగదుగా
మన్నేగదా ఇల నీ శరీరము - మరలా మన్నైపోవునురా ||మరణపు ||
Verse 4
ఆగదు మరణం నీకోరికపై - తెలియదునీకు నీ మరణదినం
బాంధవ్యాలిల తెగిపోవునుగ - ఎవరు నీ తోడు రారుగదా ||మరణపు ||
Verse 5
సిలువ యందే నీకు క్షమాపణ - ఒప్పుకొనుము నీ పాపములు
క్రీస్తునందే నిత్యజీవము - విశ్వసించుము ఈ దినమే
గొప్ప రక్షణ పొందుటకు ||మరణపు ||