Verse 1
నా జీవిత కాలమంత నీ దివ్య నామమును
కీర్తింతును ధ్యానింతును యేసయ్య కీర్తింతును ధ్యానింతును
నీ గానమే నాకు సంతోషము నీ ధ్యానమే అతిమాధుర్యము
Verse 2
నీ జ్ఞానము చేతనే సృష్టిని చేశావు
అన్నిటి కంటే మిన్నగ నన్నెన్నుకున్నావు
మంటినే కదా నీ జీవము లేనపుడు
ఆ జీవముండు వరకు నిన్ను కీర్తింతును ||ఆనం ||
Verse 3
అజ్ఞానముచేత నీ దారి వీడినపుడు
నాకై నీకుమారుని నరునిగ పంపితివి
మరణమునకు అప్పగించ వెరవలేదు గనుక
నా ప్రాణముండు వరకు నిన్ను కీర్తింతును ||ఆనం ||
Verse 4
ఆనందింతును సంతోషింతును ఉత్సహించి గానం చేతును