Verse 1
ఇది దేవుడు చేసిన కార్యం - విలువైన వివాహ సమయం
అన్నిట ఎంతో ఘనమైనది - అందుకే మనకు ప్రియమైనది - 2 || ఇది ||
Verse 2
ఆయన యందు భయభక్తులు గలవారిని వీడక ఉంటాడు
మేలగు వాటిని దయచేసి క్షేమకరుడుగా ఉంటాడు - 2 ||ఇది ||
Verse 3
ప్రభు యేసే మీ నాయకుడై ఆయన ప్రేమే మీ బలమై
సంసారమున సాగాలి చల్లగ ఎపుడు వర్ధిల్లాలి - 2 ||ఇది ||