యేసుని పోలిన జీవితము చాలు - తుదకు యీ భువిలో
అనుదిన మాయన అడుగుజాడలను - వెంబడింతును నేను
గెత్సెమనే వనమున వినిన - రోదన నా కొరకే
వేదన కలిగి ఆత్మలో నేను - మేల్కొని యుండుటకు ||యేసుని ||
అల్పకాల పాప సుఖములకన్నను - శ్రమలే మేలునాకు
ఈలోక ధనము కన్నను క్రీస్తుని - నందే మహాభాగ్యం ||యేసుని ||
ఈ ధరలో శ్రమ నిందలొచ్చినను - యేసుని నేన్ వీడను
ఆదరిచేరి ఆయనయందు - అనయము ఆనందింతున్ ||యేసుని ||
నిరాశ్రయుల ఆశ్రయస్థానము - ఆధారము నీవే
నిస్సహాయుల సహాయము దివ్య - ఆదరణయు నీవే ||యేసుని ||
సముద్రమయిననూ సమతలమయినను - సదా సేవించెదన్
కొండలయిననూ బండలయిననూ - అడ్డగించవు నన్ను ||యేసుని ||
జలములైనను జ్వాలలయినను - జడవను నేనిలలో
జాలికలిగిన నాధా - నీదు జ్యోతిగా చేయునన్ను ||యేసుని ||
స్వర్గలోక సమ జీవితమునాకు - సాధ్యమాయెను సుమా
స్వర్గ సింహాసనీయుడు నాలో - నివాసమున్నందున ||యేసుని ||
ఆనందమే పరమానందమేసదా - క్రైస్తవ జీవితము