Verse 1
దయగల నీ ఆత్మ ... సమభూమి గల ప్రదేశమందు
నను నడిపించునుగా - నను నడిపించునుగా
Verse 2
ఎన్నికలేని నా జీవితములో
నీ కృపా వర్షము కుమ్మరించి
పరమ భాగ్యము - నాకిచ్చుటకై
పరమును వీడితివి - భువి కరుదెంచితివి ||దయగల ||
Verse 3
నీవే నా దేవుడవు - నీ చిత్తముగా వర్తించుటకై
సత్యసువార్తను - చాటించుటకై
రక్షణ నొసగితివి - జీవము నిచ్చితివి ||దయగల ||
Verse 4
రక్షణ పాత్రను నే చేబూని - నిత్యము నీతో నడిచెదను
నీ కృపాతి శయమును బట్టి
గానము చేసెదను - నీ ప్రేమను పాడెదను ||దయగల ||