Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aa Dari Chere

ఆ దరి చేరే

Aa Dari Chere

Verse
ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే‖ 2x ‖
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా‖ 2x ‖
Verse
విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు‖ 2x ‖
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు‖ 2x ఆ దరి ‖
Verse
సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను‖ 2x ‖
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను‖ 2x ఆ దరి ‖
Verse
వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు‖ 2x ‖
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర‖ 2x ఆ దరి ‖

Related Tags

ComfortLifeHope