Verse
ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ‖ 2x ‖
Verse
గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను‖ 2x ‖
కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను‖ 2x ‖
Verse
మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము
యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె
Verse
గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను
Verse
పాపములోనే ఉందువా - పాపము వలన మరణము
నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము
Verse
హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము
చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును