Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aa Ningilo Veligindi

ఆ నింగిలో వెలిగింది

Aa Ningilo Veligindi

Lyricist: Bunny Sudarshan
Verse
ఆ నింగిలో వెలిగింది ఒక తార
మా గుండెలో ఆనందాల సితార
నిజ ప్రేమను చూసాము కళ్ళారా
ఈ లోకంలో నీ జన్మము ద్వారా
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
హృదయంలోని యేసు పుట్టిన వేళ
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ
యేషు మేరా గాన్ హాయ్ తూ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
Verse
లోకంలో యాడ చూసిన శోకాలేనట
పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట
అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట
అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట
విశ్వాన్ని సృష్టించిన దేవుడంట
పశువుల పాకలోన పుట్టాడంట
పాటలు పాడి ఆరాధించి
నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్‖ యేషు ‖
Verse
చీకటిలో చిక్కుకున్న బీదవారట
చలి గాలిలో సాగుతున్న గొల్లవారట
అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట
వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట
దావీదు పట్టణమందు దేవుడంట
మనకొరకై భువిలో తానే పుట్టాడంట
వేగమే వెళ్లి నాథుని చూసి
పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్‖ యేషు ‖

Related Tags

WorshipChristmasCelebration