Verse
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు‖ 2x ‖
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే‖ 2x ‖
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే‖ 2x ఆ రాజే ‖
Verse
యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను‖ 2x ‖
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను)‖ 2x ఆనందమే ‖
Verse
వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను‖ 2x ‖
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను)‖ 2x ఆనందమే ‖