Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aa Yandhakaarampu Reyilo Kreesthu Pada

ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడ

Aa Yandhakaarampu Reyilo Kreesthu Pada

Lyricist: Purushothamu Choudari
Chorus
ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరే
సాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువు
భక్తుల కనియె‖ నా యంధ ‖
Verse
ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁ
చెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసె
వీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టె
విరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్ర
నాన నిచ్చెన్ ద్రాక్షారసం‖ బా యంధ ‖
Verse
తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకు
నొనరంగ ద్రాక్షారస మును గురుతుగాఁ దెలిపి నెనరుగల కర్త యపుడు
చనె గెత్సెమను వన స్థలిలోన శిష్యుల నునిచి తానొక్కరుండు
మనసు వ్యాకులము చే తను నిండియుండఁగా ఘనుడు ప్రార్ధించెఁదండ్రిన్
గాఢముగాను‖ ఆ యంధ ‖
Verse
శ్రమచేతఁ దన శరీ రము నుండి దిగజారెఁ జెమట రక్తపు బొట్లుగా
నమితమౌ లోకపా పముఁ జూచి నిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి
క్రమముగా దూత తన కడ కరుగుదెంచి శాం తముఁ బల్కి చనిన
పిదపం తమ మనంబులఁ బోలు తమసమున యూద సై న్యము
లేగుదెంచె నపుడు గెత్సెమను పనికి‖ నా యంధ ‖
Verse
పరశాంతి శీల స ర్వజ్ఞతలు గల ప్రభుం డెరిఁగి తనకున్న పాట్లు
పరిపంధి గణముతోఁ బలికె మీరిచ్చోట నరయుచున్నా రెవనిని
నరులు నజరేతు యే సను వాని ననఁగఁ దా నెఱిఁగించె నేనేయని
గురుదీప శిఖల సో కు పతంగముల భంగి ధరణిపైఁ బడిరి వారల్
దర్పము లణఁగి‖ యా యంధ ‖
Verse
తన శిష్యులను విడువుఁ డని రిపులచేఁ దానె పట్టువడియెన్ కినిపి
పేతురు యాజ కుని దాసు కర్ణంబు దునుమంగ క్రీస్తుఁడపుడు
కనికరంబున స్వస్థ తను జేయు నావిభుని కరములను విరిచి కట్టి
వెనుక ముందరఁ జుట్టు కొని యెరూషలేము పుర మునకుఁ దీనుకఁ
బోయిరి రాణువవార‖ లా యంధ ‖

Related Tags

Passion WeekLast SupperGethsemane