Verse 1
ఆశ నిరాశ అయినవేళలో - నాయేసు నాకుతోడుగా
ఆదరణలేని వాడనై యుండగా - నాక్రీస్తు నాకు అండగా
Verse 2
నరుని వ్యర్ధసాయముకై కనిపెట్టుచూ
శ్రమలో ధైర్యముచెడి కృంగిపోయిఉండగా - 2
భయపడకని అభయమిచ్చి నన్నుధైర్యపరచి
భారభరిత బ్రతుకున స్తుతివస్త్రమునిచ్చి
తనకు సాక్షిగనిలిపి శోభాతిశయముగ నన్ను మార్చుటకై ||పిలువగనే ||
Verse 3
ఇరుకులో ఓదార్చి ఆదరించువారు లేక
నాప్రాణము బహుగా సొమ్మసిల్లియుండగా - 2
భయముచేత నాదుబలము సడలిపోయినప్పుడు
పశ్చాత్తాపమునొంది ప్రభుని (వైపుచూడగా) ప్రార్థించగా
కృపచే బలపరచి ఉన్నతమైన స్థితిలో నన్ను నిలుపుటకై ||పిలువగనే ||
Verse 4
పిలువగనే పలికెనని - ఆపదలో ఆదుకొనెననీ
ప్రభువును స్తుతియించెద - నిరతము కొనియాడెద