Verse 1
ఎంత చక్కని దోయి యేసయ్య మాట
ఎంత పరిమళమోయి ఆ మాట బాట || ఎంత ||
Verse 2
పాపాంధకారములో పడియున్న నన్ను - వెలుగు కిరణమై దర్శించినది
హృదయపు చీకటి తొలగించి వేసి - నిత్యానందముతో నను నింపినది ||ఎంత ||
Verse 3
నా పాదములకు దీపము వలెను - నా త్రోవకును వెలుగైయుండి
నూతనమైన మార్గములన్నిటిలో - నిత్యము నన్ను నడిపించుచున్నది ||ఎంత ||
Verse 4
జుంటె తేనె ధారల కన్నా - నా హృదయమునకు మధురమైనది
అపరంజి, బంగారు కన్నా - ఆ మాటే నాకు అతి ప్రియమైనది ||ఎంత ||