Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aacharinchuchununnaamu Aa Chandamu Memu

ఆచరించుచునున్నాము ఆ చందము మేము

Aacharinchuchununnaamu Aa Chandamu Memu

Lyricist: William Dakan
Chorus
ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు
సెల విచ్చివేంచేసితో పరమండలికి‖ ఆచరించు ‖
Verse
నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా
గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ
శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది‖ యాచరించు ‖
Verse
భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ
స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు
ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి‖ యాచరించు ‖
Verse
పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ
నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున
నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను‖ యాచరించు ‖
Verse
పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్
దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ
కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు‖ నాచరించు ‖

Related Tags

Baptism