Chorus
ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక
యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్‖ ఆద ‖
Verse
నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు
నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
Verse
సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు
లొసగుము నీతి నిధుల సజీవుడా‖ ఆద ‖
Verse
ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి
నా ప ద్బాంధవ విడిపించుమా‖ ఆద ‖
Verse
పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా
మొరను గైకొని కలుషముల నెడబాపవే‖ ఆద ‖
Verse
పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు
విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా‖ ఆద ‖