Verse
ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా‖ ఆధారం ‖
Verse
భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా‖ 2x ‖
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా‖ 2x ‖
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా‖ 2x ఆధారం ‖
Verse
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా‖ 2x ‖
విడువను ఎడబాయనని పలికిన నా దేవా‖ 2x ‖
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా‖ 2x ఆధారం ‖
Verse
దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా‖ 2x ‖
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా‖ 2x ‖
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా‖ 2x ఆధారం ‖