Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadi Premanu Vidachipettithiva O Naadu Priyuda Maadiriga Jeevincha Maanithiva

ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా

Aadi Premanu Vidachipettithiva O Naadu Priyuda Maadiriga Jeevincha Maanithiva

Chorus
ఆది ప్రేమను విడచిపెట్టితివా
ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా‖ 2x ‖
Verse
నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు
నిశ్చయముగ ఒప్పుకొంటివి స్వంత పనులకు సాగిపోతివి
Verse
సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్ల సేవ చేయుచు
ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనను పలికితివిగా
Verse
మనుష్య సంగతులను తలంచి మనుష్యేచ్ఛలకు లొంగిపోయి
యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి
Verse
ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునోయని
నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీదు ప్రభుని
Verse
మేడమిద్దెల పొలము ఆస్తుల పుడమి నికనెన్నో ఘనతలకు
ఇదియే సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువా
Verse
యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి యిట్లు
మార్చుకొంటివి నీదునడతను నాథుడేసుడు ఏడ్చుచుండె
Verse
నీదు దీపము యింక యిలలో ఆరిపోవక ముందెనెరిగి
సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ జేయుము

Related Tags

RepentanceDevotionFaithfulness