Verse
ఆదినములలో దేవోక్తి - అరుదాయెను - దేవునివార్త
ఆదినములలో దేవోక్తి
Verse
దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట
ఆదినములలో దేవోక్తి
Verse
ఇశ్రాయేలీయుల కానాడు - యే రాజు లేకపోయె
తనయిష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు
Verse
పరమ తండ్రి మందసము - చెరపట్టినందున
ప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి
Verse
దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెను
సైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను
Verse
సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనే
ప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను
Verse
లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెను
యెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను
Verse
యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధ
దేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు