Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadiyanthamu Lenivaadaa

ఆదియంతము లేనివాడా

Aadiyanthamu Lenivaadaa

Lyricist: Songs Of Zion
Verse
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
Verse
అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి‖ ఆదియంతము ‖
Verse
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి‖ ఆదియంతము ‖
Verse
యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి‖ ఆదియంతము ‖
Verse
పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి‖ ఆదియంతము ‖
Verse
దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి‖ ఆదియంతము ‖

Related Tags

PraiseWorship