Verse
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడవగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
Verse
అబ్రాహామును పిలిచితివి - ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే - అనాధుడవై వచ్చితివి
Verse
ఇస్సాకును విడిపించి - యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి - పాపులకై మరణించితివి
Verse
యోనావలె మూడు దినముల్ - భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప - మహిమతోడ లేచితివి
Verse
పండ్రెండు గోత్రముల - జెంది - పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను - కన్యకను వరించితివి
Verse
దావీదు కుమారుడవు - దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు - పాపిని నన్ను ప్రేమించి