Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aagadhu Naa Payanam Siyonu Cherakundaa

ఆగదు నా పయనం సీయోను చేరకుండా

Aagadhu Naa Payanam Siyonu Cherakundaa

Lyricist: Pastor Jafanya Sastry
Verse
ఆగదు నా పయనం – సీయోను చేరకుండా
ఆశలు కోరికలు – వెనకకు లాగినను
నా గమ్యము చేర – సాగిపోయెదను
Verse
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగి ఫలియించెదన్
Verse
ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మను
నీ నీడలో కాయుమా
Verse
గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెను
Verse
ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయాల్లో దాగుందును
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదను
బలము నీదే కదా
కృపయు నీదే కదా
Verse
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగి ఫలియించెదన్

Related Tags

FaithStrengthJourneyZion