Verse
ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా
Verse
ఆగక సాగుమా
సేవలో సేవకా‖ 2x ‖
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక‖ 2x ఆగక ‖
Verse
పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు‖ 2x ‖
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు‖ 2x ఆగక ‖
Verse
తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము‖ 2x ‖
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము‖ 2x ఆగక ‖