Verse
ఆగక సాగుమా సేవలో సేవకా
ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక
Verse
పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు
విడువడు నిన్ను యెడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు
Verse
తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము
ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుమా