Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aagani Parugulo Endina Edaarulu

ఆగని పరుగులో ఎండిన ఎడారులు

Aagani Parugulo Endina Edaarulu

Lyricist: Joshua Shaik, Passion For Christ Ministries
Verse
ఆగని పరుగులో ఎండిన ఎడారులు
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
Verse
ఉన్నపాటునా నలిగె నా వైపునా
కదలిరాలేవా ఆదరించగ రావా
Verse
కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై
Verse
కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి
అందించే నీ చేయి, నా స్నేహమై
Verse
లోకప్రేమే సదా - కలల కడలే కదా
తరంగమై కావుమా - తిరిగి తీరమునకు‖ 2x ‖
నీవే కదా ఆధారం
సదా నీకే దాసోహం
యేసయా ... అర్పించెదా - నా జీవితం
Verse
ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా - జార విడువకు నన్ను‖ 2x ‖
నీవే కదా నా మూలం
సదా నీపై నా భారం
యేసయా ... ప్రేమించెదా - కలకాలము

Related Tags

ComfortHopeGods Love