Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aagipodhu Na Paata Gamyam Cheredaaka

ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాక

Aagipodhu Na Paata Gamyam Cheredaaka

Verse
ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక
సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక
Verse
లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను
అలసటతో జోగినా శృతి తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
Verse
నా అడుగు జారినా కలవరము చెందను
నా బలము పోయినా లయ తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
Verse
శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను
మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును

Related Tags

FaithChristian LifePerseverance