Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaha Hallelujah

ఆహా హల్లెలూయా

Aaha Hallelujah

Lyricist: Anil Kumar Vemula
Verse
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…
గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే…
Chorus
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది‖ 2x ‖
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా….
Verse
తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే‖ 2x ‖
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది‖ 2x ‖
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..‖ తార జూపిన ‖
Verse
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ‖ 2x ‖
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ..‖ ఆహా హల్లెలూయా ‖
Verse
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా‖ 2x ‖
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ..‖ ఆహా హల్లెలూయా ‖
Verse
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా‖ 2x ‖
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ..‖ ఆహా హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipChristmas