Verse
ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా‖ ఆహా ‖
Verse
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే‖ 2x ‖
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను‖ 2x ఆహా ‖
Verse
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ‖ 2x ‖
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి‖ 2x ఆహా ‖
Verse
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని‖ 2x ‖
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె‖ 2x ఆహా ‖
Verse
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో‖ 2x ‖
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే‖ 2x ఆహా ‖