Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aahaa Mahaathma

ఆహా మహాత్మ

Aahaa Mahaathma

Lyricist: Panthagani Paradeshi
Verse
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా‖ ఆహా ‖
Verse
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై‖ ఆహా ‖
Verse
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి‖ ఆహా ‖
Verse
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి‖ ఆహా ‖
Verse
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా‖ ఆహా ‖
Verse
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా‖ ఆహా ‖
Verse
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా‖ ఆహా ‖
Verse
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా‖ ఆహా ‖

Related Tags

RepentanceGood FridayPassion