Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aahaa Mahaathma Haa Sharanyaa Haa Vimochaka

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచక

Aahaa Mahaathma Haa Sharanyaa Haa Vimochaka

Lyricist: Panthagani Paradeshi
Chorus
ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను
నా దోషమేగదా‖ యాహా ‖
Verse
"వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్" కోరి తిటులు నిన్నుఁ
జంపు క్రూరజనులకై‖ యాహా ‖
Verse
"నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు" పావనుండ యిట్లుఁ బలికి
పాపిఁ గాచితి‖ వాహా ‖
Verse
"అమ్మా! నీ నుతుఁడ" టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర "నీ
జనని" యంచుఁ గర్త నుడివితి‖ వాహా ‖
Verse
"నా దేవ దేవ యేమి విడ నాడితి" వనుచు శ్రీదేవ సుత పలికితివి
శ్రమ చెప్పశక్యమా‖ యాహా ‖
Verse
"దప్పికొనుచున్నా న" టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా!‖ యాహా ‖
Verse
శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా "సమాప్తమైన" దంచుఁ
దెలిపి సమసితివి గదా‖ యాహా ‖
Verse
"అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ" నంచును గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా‖ యాహా ‖

Related Tags

Good FridayCrucifixionPassion Week