Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aahaa Naakemaanandamu Shree Yesu Naacha

ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచ

Aahaa Naakemaanandamu Shree Yesu Naacha

Lyricist: J H Gilmore
Verse
ఆహా నాకేమానందము
శ్రీ యేసు నాచేఁ బట్టుచు
సహాయుఁడై నాయన్నిటన్
సజీవుఁడై నడుపును.
నా దారిఁ జూపును యేసు‖ నా దారిఁ జూఁపును ‖
నా చేఁబట్టి నడుపును
ఎన్నఁడు నెడబాయఁడు
యేసె నా దారిఁ జూఁపును
Verse
యేదే స్సుఖంబు లైనన్
సదా విచార మైనను
బాధాంధకార మైనను
ముదంబుతోడ నుందును.
Verse
చింతేల నాకు నీ దయన్
సంతత మీవు తోడుగాన్
బంతంబు నీచేఁ బట్టుచు
సంతృప్తితో నే నుందును.
Verse
నా చావు వేళ వచ్చినన్
విచార మొందక ధృతిన్
నీ చేయి బట్టి యేసుఁడా
నీ చారు మోక్ష మెక్కుదున్

Related Tags

FaithGuidanceJoy