Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aahaa Yeamaanandam Aahaa Yeamaanandamu Cheppashakyamaa

ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా

Aahaa Yeamaanandam Aahaa Yeamaanandamu Cheppashakyamaa

Verse
ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా
ఆహా నారాజగు యేసు నావృజినముల మన్నించివేసెను
Verse
ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించెదము
వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము
Verse
పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను
దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను
Verse
అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందున
రక్షకుడు యేసునుగూర్చి మా సాక్ష్యము నిశ్చయముగ నిత్తుము
Verse
తెల్లంగి, వాద్యము, స్వర్ణ కిరీటము, మేడపై జయజండాల్
ఉల్లసించి మంటినుండి మింటకేగిన రాజున్ స్తుతింతుము

Related Tags

PraiseTestimonyJoy