Verse
ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా‖ 2x ‖
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను‖ 2x ఆహా ‖
Verse
ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము‖ 2x ‖
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము‖ 2x ఆహా ‖
Verse
అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున‖ 2x ‖
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము‖ 2x ఆహా ‖
Verse
తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్‖ 2x ‖
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము‖ 2x ఆహా ‖