Verse
ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
నిశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
నిత్యరాజ్యము చేర్చుటకై రక్షకుడుదయించాడని
జగమంతటా జయకేతనమై సాక్షిగ నిలిచింది
Chorus
ఇక సంతోషమే మహాదానందమే జగమంతా పండుగ
ఇక ఉత్సాహమే ఎంతో ఉల్లాసమే మన బ్రతుకుల్లో నిండుగా
Verse
పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం
పరమాత్ముని ఆగమనం పాపాత్ముల విమోచనం
తండ్రి చిత్తమును నెరవేర్చే తనయుడై పుట్టెను
తన పథములో మనల నడిపించే కాపరై వచ్చెను
దివినేలే రారాజు దీనునిగా జన్మించెను
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము
చిరునవ్వులు చిందించే శిశువై మదిమదినీ మీటెను
చిరు జ్యోతులు మనలో వెలిగించి చింతలే తీర్చెను