Chorus
ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
Verse
కృపజూపి నిబంధనను - నెరవేర్చిన ఉపకారి
కాపాడితివి నడిపితివి - నీ యింటికి మమ్ములను
Verse
నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున - నీవె కడుగు కరుణామయ
Verse
నీతి న్యాయముల కర్త - ప్రీతితోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు
Verse
రాజులనుగా యాజకులనుగా - మము చేసిన మా రాజా
విజయమిమ్ము మా విజయుండా - నిజమైన నీ ప్రజలకు
Verse
కరువు తెగులు కష్టనష్టముల్ - వర్ష లేమి పురుగు బాధల్
కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను
Verse
సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచన
అనుభవింప ననుగ్రహించు - మనిశంబు మాకిచట
Verse
బలపరచు నీ భక్తులను - బలము తోడ ప్రవేశించి
విలువైన నీ రక్షణన్ను - ధరింపజేయు మల్లెలూయ