Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakaasha Mahaakaashambulu

ఆకాశ మహాకాశంబులు

Aakaasha Mahaakaashambulu

Verse
ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా‖ 2x ‖
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి‖ 2x ‖
కాపాడితివి నడిపితివి‖ 2x ‖
నీ యింటికి మమ్ములను‖ 2x ఆకాశ ‖
Verse
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు‖ 2x ‖
నీదు కల్వరి రక్తమున‖ 2x ‖
నీవే కడుగు కరుణామయా‖ 2x ఆకాశ ‖
Verse
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు‖ 2x ‖
నీతి న్యాయముల నిమ్ము‖ 2x ‖
స్తుతియింప నిరతంబు‖ 2x ఆకాశ ‖
Verse
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ‖ 2x ‖
విజయమిమ్ము మా విజయుండా‖ 2x ‖
నిజమైన నీ ప్రజలకు‖ 2x ఆకాశ ‖
Verse
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి‖ 2x ‖
విలువైన నీ రక్షణను‖ 2x ‖
ధరింప చేయుము హల్లెలూయా‖ 2x ఆకాశ ‖

Related Tags

PraiseWorshipCovenant