Verse
ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు కోయవు
అవి గరిసెలలో దాచుకోవు.. వూ.. వూ..‖ ఆకాశ ‖
Verse
అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి‖ ఆకాశ ‖
Verse
స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు‖ ఆకాశ ‖
Verse
పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ‖ ఆకాశ ‖