Verse
ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం‖ 2x ‖
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే‖ 2x ‖
మార్గము నీవే – జీవము నీవే‖ ఆకాశం ‖
Verse
పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా‖ 2x ‖
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా‖ ఆకాశం ‖
Verse
నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా‖ 2x ‖
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా‖ ఆకాశం ‖
Verse
భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా‖ 2x ‖
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా‖ ఆకాశం ‖