Verse
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియొగ్గుమా‖ 2x ‖
అని దేవుడు మాటలడుచున్నాడు
తన వేదన నీతో చెబుతున్నాడు‖ 2x ఆకాశమా ‖
Verse
నేను పెంచిన నా పిల్లలే
నా మీదనే తిరగబడిరనీ‖ 2x ‖
అరచేతిలో చెక్కుకున్నవారే
నా అరచేతిపై మేకులు కొడుతూ‖ 2x ‖
నను దూరంగా ఉంచారని
నా పిల్లలు బహు చెడిపోతున్నారని‖ 2x దేవుడు ‖
Verse
విస్తారమైన బలులు నాకేల
క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే‖ 2x ‖
కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం
మేకల రక్తం నాకిష్టము లేదు‖ 2x ‖
కీడు చేయ మానాలని
బహు మేలు చేయ నేర్వాలని‖ 2x దేవుడు ‖
Verse
పాపిష్టి జనమా, దుష్టసంతానమా
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ
Verse
అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు
మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును
ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు
మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును
నన్ను విసర్జించువారు లయమగుదురని
నీరులేని తోటలా నశియింతురని‖ 2x దేవుడు ‖
Verse
ఆకాశమా భువికి చెప్పుమా
భూమీ లోకాన చాటుమా‖ 2x ‖