Verse
ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను‖ 2x ‖
Verse
శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా‖ 2x ‖
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను‖ 2x ఆకాశమందు ‖
Verse
వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు‖ 2x ‖
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను‖ 2x ఆకాశమందు ‖
Verse
పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు‖ 2x ‖
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు‖ 2x ఆకాశమందు ‖