Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakasham Amrutha Jallulu

ఆకాశం అమృత జల్లులు

Aakasham Amrutha Jallulu

Verse
ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది‖ 2x ‖
అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా‖ 2x ‖
రక్షణకై నిరీక్షణతో‖ 2x ‖
వీక్షించే ఈ అవనిలో‖ 2x ‖
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ‖ ఆకాశం ‖
పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా‖ 2x ‖
సమ్మతిని మమతలను‖ 2x ‖
పెంచుటకై ఈ పృథివిపై‖ 2x ‖
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ‖ ఆకాశం ‖

Related Tags

ChristmasNativityPeace